‘మన గణపయ్యా..పాన్ వరల్డ్’..విదేశాల్లో గణపయ్యను ఏమని పిలుస్తారంటే?

by Jakkula Mamatha |
‘మన గణపయ్యా..పాన్ వరల్డ్’..విదేశాల్లో గణపయ్యను ఏమని పిలుస్తారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా గణనాథుడి ఉత్సవాలు జరుపుకుంటారు. దేశ, విదేశాల్లో ఇవాళ(శనివారం) ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తొలి పూజలందుకునే ఇలవేలుపుగా ఏకదంతునికి పేరు. గ‌ణ‌ప‌తిని దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. ‘గణానాం త్వా గణపతిగ్ం హవామహే’ అని మంత్రాలు పూజల్లో ఆయనకు అగ్రస్థానం ఇచ్చాయి. శివ, విష్ణు కల్యాణంలో సైతం తొలుత గణపతిని కొలవడం ఆనవాయితీ. ఆదిగురువు గణపతికి అనేక దేశాల్లో దేవాలయాలు నిర్మించి పూజిస్తున్నారు. నేడు అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి.

విఘ్నాలను తొలగించే గణపయ్య వరల్డ్ ఫేమస్. విదేశాల్లోనూ పలు పేర్లతో పూజలందుకుంటున్నాడు. థాయ్‌లాండ్ ప్రజలు అంబోదరుడిని ‘ఫిరా ఫికానెట్’ పేరుతో పిలుస్తారు. టిబెట్‌లో మహారక్త గణపతి రూపాల్లో ఆరాధిస్తారు. ఇండోనేషియాలో మాంత్రిక కర్మలలో అడ్డంకులు తొలగించే దేవునిగా వినాయకుడిని భావించి కొలుస్తారు. మయన్మార్‌లో బ్రహ్మగా, నేపాల్‌లో తంత్ర గణపతిగా పూజలు అందుకోవడం జరుగుతుంది. చైనాలో ‘హువాంగ్ సీ టియాన్’, జపాన్‌లో ‘కంగిటెన్’ అని పిలుచుకుంటారు. కాంబోడియా, అఫ్గాన్‌లోనూ ఏకదంతుడి ఆలయాలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed