- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంజాన్ మాసం సందర్భంగా.. 1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష
దిశ, వెబ్ డెస్క్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 1,025 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 1,025 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్యమైన ఇస్లామిక్ సందర్భాలలో యూఏఈలోని ప్రతి ఎమిరేట్ పాలకులు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంటారు. సత్ర్పవర్తన కలిగిన ఖైదీలకు సామాజిక, వృత్తిపరమైన జీవితాలను గడపడానికి వీలుగా వారికి ఒక అవకాశం కల్సించాలనే ఉద్దేశంతో ఇలా క్షమాభిక్ష పెడుతుంటారు.
ఇదిలా ఉంటే.. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్లకు పైగా ముస్లింలు పవిత్ర మాసం ఆచారాలను స్వీకరించడానికి సిద్ధం అవుతున్నారు. బుధవారం (మార్చి 22)న చందమామ కనిపిస్తే ఈ రోజు నుంచే రంజాన్ మాసం ప్రారంభమఅవుతోంది. లేదంటే రేపటి (గురువారం) నుంచి పవిత్ర మాసం ప్రారంభం కానుంది. ఈ మేరకు యూఏఈ మూన్ సైటింగ్ కమిటీ భేటీ అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల ఉపవాసాలు చంద్రుడు కనిపించే సమయాన్ని బట్టి 29 లేదా 30 రోజల పాటు కొనసాగుతాయి.