US Election: ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలరని ఒబామాకు నమ్మకం లేదు: నివేదిక

by Harish |   ( Updated:2024-07-25 04:34:06.0  )
US Election: ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలరని ఒబామాకు నమ్మకం లేదు: నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న తరువాత డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీపడుతున్నారు. ఆమె తన ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ప్రచారంలో ఈ ఇద్దరు నేతలు కూడా దూసుకుపోతున్నారు. అయితే 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలరనే నమ్మకం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేదని న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన ఒక నివేదిక వెల్లడించింది. చాలా మంది డెమొక్రాటిక్ నాయకులు కమలా హారిస్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా మద్దతు ఇచ్చారు, అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఇప్పటివరకు దూరంగా ఉన్నారు. ఆయన కమలా అభ్యర్థిత్వాన్ని ఇంకా ఆమోదించలేదు. ఒబామా ప్రస్తుతం కోపంగా ఉన్నారు. ఆయనకు తెలుసు, కమలా హారిస్‌ ట్రంప్‌ను ఎదుర్కొలేరని నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉంటే జో బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఊహాగానాలు వస్తున్న సమయంలోనే ఆయన స్థానంలో మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వస్తారని అంచనా వేశారు. ముఖ్యంగా ట్రంప్‌- బైడెన్ మధ్య అధ్యక్ష చర్చ తర్వాత ఇది ఎక్కువ అయింది. రాజకీయ విశ్లేషకులు కూడా మిచెల్ పోటీలో ఉంటారని తెలిపారు. డెమొక్రాట్లు అధికారాన్ని దక్కించుకోడానికి ఆమె కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేయగా, తాజాగా కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed