అమెరికాలో డేంజరస్ బ్యాక్టీరియా.. ముగ్గురి బలి

by Vinod kumar |
అమెరికాలో డేంజరస్ బ్యాక్టీరియా.. ముగ్గురి బలి
X

వాషింగ్టన్ : అమెరికాలో డేంజరస్ బ్యాక్టీరియా దడ పుట్టిస్తోంది. మనిషి ఒంట్లోని మాంసాన్ని తినేసే ఆ ప్రాణాంతక బ్యాక్టీరియా వల్ల న్యూయార్క్, కనెక్టికట్‌‌లలో ముగ్గురు చనిపోయారు. ఉప్పునీటిలో, సముద్ర సంబంధిత ఆహారంలో ఈ బ్యాక్టీరియా ఉంటుందని వైద్యులు తెలిపారు. దీనిపేరు "విబ్రియో వల్నిఫికస్" అని.. ఇది కలరా వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా కుటుంబానికి చెందినదన్నారు. లాంగ్ ఐలాండ్ సౌండ్‌లో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులకు సముద్రంలో ఈత కొట్టే క్రమంలో ఈ వైరస్ సోకడంతో మరణించారని వెల్లడించారు. మూడో వ్యక్తి.. పచ్చి ఆల్చిప్పల (ఆయిస్టర్స్‌)ను తిన్న తర్వాత ఈ వైరస్ సోకడంతో జూలైలో చనిపోయాడని పేర్కొన్నారు. కనెక్టికట్ నగరం ప్రజారోగ్య అధికారి ఈ వివరాలను తెలిపారు. చనిపోయిన ముగ్గురి వయసు 60 నుంచి 80 ఏళ్లలోపు ఉందన్నారు.

"విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా కారణంగా చర్మానికి గాయాలవుతాయి. చర్మం పగిలిపోతుంది. అల్సర్లు అవుతాయి. ఈ బాక్టీరియా సోకినపుడు సాధ్యమైనంత త్వరగా చికిత్స పొందాలి. లేదంటే ఇది మనిషి ఒంట్లో ఉన్న మాంసాన్ని తినేస్తుంది" అని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా న్యూయార్క్ జలాల్లోకి చేరిందా..? మరొక చోట ఉందా..? అనే అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. విబ్రియో బాక్టీరియా చాలా అరుదైనదని, దురదృష్టవశాత్తు అది న్యూయార్క్ ప్రాంతానికి వచ్చిందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ తెలిపారు. గాయాలైన వారు సముద్ర జలాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed