- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిలిటెంట్ల చెర నుంచి 9 మంది భారతీయులు విడుదల
ట్రిపోలి (లిబియా) : చాలా నెలలుగా లిబియాలో మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న తొమ్మిది మంది భారతీయులు ఎట్టకేలకు విడుదలయ్యారు. ఈవిషయాన్ని ట్యునీషియాలో భారత రాయబారి గుల్ఖం జాథోమ్ గాంగ్టే ప్రకటించారు. లిబియాలోని బెన్ ఘాజీ సిటీలో ఉన్న ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్ తబస్సుమ్ మన్సూర్ సాయంతో వారికి మిలిటెంట్ల నుంచి విముక్తి లభించిందని తెలిపారు. ఈ తొమ్మిది మంది భారతీయుల్లో ఐదుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కాగా, మిగిలిన వారు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలవారు.
"గ్రీస్ దేశానికి చెందిన ఎంటీ మాయ1 అనే వాణిజ్య నౌకలో మేం పనిచేసే వాళ్ళం.. మా నౌక మాల్టా దేశం నుంచి లిబియా రాజధాని ట్రిపోలికి చమురు ఉత్పత్తులతో బయలుదేరింది. అయితే నౌక లిబియా తీరానికి చేరుకునే క్రమంలో సడెన్ గా మరమ్మతుకు గురై ఆగిపోయింది. ఆ వెంటనే అక్కడున్న స్థానిక మిలీషియా మమ్మల్ని పట్టుకుంది" అని బందీ నుంచి విముక్తి అయిన ఇండియన్స్ చెప్పారు.