- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యాకు సహాయం చేయడంపై చైనాను హెచ్చరించిన నాటో కూటమి
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా చైనా తన సైనిక సామాగ్రి, ఆయుధాలు, ఇతర సహాయాన్ని అందిస్తుందన్న ఆరోపణలతో ఆ దేశాన్ని నాటో కూటమి హెచ్చరించింది. రష్యాకు అన్ని భౌతిక, రాజకీయ సహాయాన్ని నిలిపివేయాలని కూటమి నాయకులు యునైటెడ్ స్టేట్స్‌లో 75వ వార్షికోత్సవ శిఖరాగ్ర సమావేశంలో చైనాను కోరారు. కొంత కాలంగా జరుగుతున్న యుద్ధంలో చైనా నుంచి రష్యాకు భారీ మొత్తంలో ఆయుధాలు అందుతున్నాయని ప్రపంచ దేశాలు ఆరోపణలు చేస్తుండగా, మొదటి సారి ప్రపంచ వేదికగా 32 సభ్యుల భద్రతా కూటమి బహిరంగంగా చైనాకు హెచ్చరికలు చేసింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 50 శాతం వాటా కలిగిన కూటమిలోని సభ్యులందరూ చైనాకు హెచ్చరికలు పంపడం ఇదే తొలిసారి అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. రష్యాకు సైనిక మద్దతు ఇవ్వడం కొనసాగితే చైనా ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్నందున, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను పాటించాల్సిన ప్రత్యేక బాధ్యత చైనాపై ఉందని నాటో కూటమి తెలిపింది.
మరోవైపు ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా F-16 జెట్‌లను అందించడానికి ప్రయత్నాలను ప్రారంభించామని నాటో కూటమి పేర్కొంది. రష్యాతో ఆకాశంలో సమానంగా పోరాడటానికి కష్టపడుతున్న ఉక్రెయిన్‌కు ఈ జెట్‌లు అదనపు బలాన్ని అందిస్తాయి. ఇదిలా ఉంటే, శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం కురిపించింది, కైవ్‌లో ఆసుపత్రిపై దాడి చేయడంతో డజన్ల కొద్ది మరణాలు సంభవించాయి.