అంగారక గ్రహంపై ఏలియ‌న్స్ ఇంటి ద్వారం.. నాసా రోవర్ ఫోటో ర‌హ‌స్యం..?!

by Sumithra |   ( Updated:2023-10-12 07:13:06.0  )
అంగారక గ్రహంపై ఏలియ‌న్స్ ఇంటి ద్వారం.. నాసా రోవర్ ఫోటో ర‌హ‌స్యం..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః నాసా పంపించిన‌ క్యూరియాసిటీ మార్స్ రోవర్ అంగారక గ్రహంపై ఇటీవ‌ల ఒక అద్భుతాన్ని క్యాప్చ‌ర్ చేసింది. ఈ ఫోటోలో ఒక కొండ రాయి ద‌గ్గ‌ర పూర్తిగా చెక్కిన‌ ముఖ ద్వారంలాంటి ప్ర‌దేశం క‌నిపించ‌డం విశేషం. కొంత కాలంగా రెడ్ ప్లానెట్‌పైన‌ రోవర్ క్లిక్ చేసిన చిత్రాలను ప‌రిశీలిస్తున్న క్ర‌మంలో ఈ ఆసక్తికరమైన విష‌యం బ‌య‌ట‌కొచ్చింది. మార్స్‌పై ఉన్న ఈ సొరంగ‌ మార్గ ముఖ ద్వారం ఏలియన్స్ నిర్మించి ఉంటార‌ని ఇప్ప‌టికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మార్స్‌పైన‌ గ్రహాంతరవాసులు ఉన్నార‌ని చెప్ప‌డానికి రుజువుగా ఈ చిత్రాన్ని పరిగణిస్తున్నారు. మార్స్‌పైన‌ ల్యాండ్‌స్కేప్‌ రాళ్లలో ఉన్న ఈ ద్వారం, మార్స్ గ్రహానికి చెందిన‌ రహస్య ప్రదేశంగా, మ‌రో ప్ర‌పంచానికి ప్రవేశ ద్వారంగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక‌, ఈ రహస్య ద్వారం గురించి ఇంటర్నెట్‌లో ఇప్పటికే అనేక వ‌దంతులు, సిద్ధాంతాలు వచ్చాయి. ఈ చిత్రంలో క‌నిపిస్తున్న ద్వారం కొండ‌ రాయిపై వ‌చ్చిన‌ పగుళ్లా లేదా దానిపై ఒక రకమైన ఒత్తిడి ఫలితంగా ఏర్ప‌డిన‌దైనా కావ‌చ్చ‌ని మ‌రో వాద‌న కూడా విన‌బ‌డుతుంది. అయితే, కొంత కాలంగా అంగార‌క గ్రహం అనేక భూకంపాలను ఎదుర్కొంటోంది కనుక ఇది నిజమే కావచ్చని అనుకుంటున్నారు. ఇక‌, ఈ ఏడాది మే 4న మార్స్‌పైన‌ అతిపెద్ద భూకంపం నమోదైన‌ట్లు కూడా శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

ప్ర‌స్తుతం, పరిశోధకులు ఈ ద్వారం ఏంటో, అది ఎలా ఏర్ప‌డిందో అర్థం చేసుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. గ్రీన్‌హ్యూ పెడిమెంట్ అని పిలిచే భౌగోళిక లక్షణం వద్ద, రోవర్ 'మాస్ట్ కెమెరా' ఈ చిత్రాన్ని తీసిందని NASA తెలిపింది. ఈ ఫోటోలో తలుపు లాంటి రాతి నిర్మాణం పెద్దదిగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది కొన్ని సెంటీమీటర్లు లేదా అంగుళాల పొడవు ఉండవచ్చు కూడా. కాబట్టి, ఏదైనా నిర్ధారణకు చేరుకోవడానికి, మరింత పరిశోధన అవసరం అంటున్నారు నిపుణులు. ఏదేమైనా, ఈ చిత్రం ఇంట‌ర్నెట్‌లో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. త‌మ త‌మ ప‌రిజ్ఞానాన్ని బ‌ట్టి ఊహ‌ల్ని క‌ల్పిస్తోంది. మీరూ చూడండి.

Advertisement

Next Story

Most Viewed