- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురు గ్రహాన్ని ఇంత దగ్గరగా.. నాసా తాజా వీడియోలో అద్భుతం!
దిశ, వెబ్‌డెస్క్ః అంతరిక్షంలో ప్రతిదీ అద్భుతమే.. భూమిపైన మనకు కనిపించే విశేషాలకు మించి స్పేస్‌లో ఇతర గ్రహాల సంగతులు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే, భూమిపైన సుదూర టెలిస్కోప్ నుండి తీసిన వివిధ గ్రహాలను చూడటం చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఇస్తాయి. ఇక, భూమి నుండి గురు గ్రహానికి సంబంధించిన వివిధ ఫోటోలను ఇప్పటికే చాలా మంది చూసుంటారు. కానీ, ఆ శక్తివంతమైన గ్రహాన్ని దగ్గరగా చూశారా? 2016 నుండి ఈ గ్యాస్ దిగ్గజం బృహస్పతిపై సంచరిస్తున్న జూనో అంతరిక్ష నౌక తీసిన కొత్త ఫుటేజీని NASA ఇటీవల విడుదల చేసింది. US ఏజెన్సీ జునోక్యామ్ ఇమేజ్ ముడి సమాచారాన్ని ఉపయోగించి, పౌర శాస్త్రవేత్త ఆండ్రియా లక్ రూపొందించిన ఈ అద్భుతమైన యానిమేటెడ్ సీక్వెన్స్‌ను నాసా ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ క్లిప్ ఏప్రిల్ 9న, గురుగ్రహం మేఘాల పైనుండి కేవలం 2,050 మైళ్లు (3,300 కిలోమీటర్లు) ఎత్తులో ప్రయాణిస్తూ, జెయింట్ ప్లాంట్ తీసిన క్లోజ్ షాట్‌ను చూపించింది.
జూనో మొదట బృహస్పతిని మాత్రమే కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, గ్రహానికి చెందిన నాలుగు పెద్ద చంద్రులు, ముఖ్యంగా గనిమీడ్, యూరోపా, ఐయోలపై కొంచెం దగ్గరగా దృష్టి పెట్టడానికి మిషన్‌ను పొడిగిస్తున్నట్లు జనవరి 2021లో NASA ప్రకటించింది. జూనో అంతరిక్ష నౌక సెప్టెంబర్ 2025 వరకు నడుస్తుందని భావిస్తున్నారు. ఇక, ఈ "విస్తరించిన మిషన్‌తో, బృహస్పతిలోని వలయాల వ్యవస్థను, గెలీలియన్ ఉపగ్రహాలను అన్వేషించడానికి గ్రహం దాటిన జునో ప్రధాన మిషన్ సమయంలో తలెత్తిన ప్రాథమిక ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తాము" అని శాన్ ఆంటోనియోలోని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ స్కాట్ బోల్టన్ నాసాలో తెలిపారు.
Cloud surfing on Jupiter with NASA's Juno spacecraft. ☁️
— NASA Marshall (@NASA_Marshall) May 31, 2022
On April 9, 2022, as the Juno mission completed its 41st close flyby of Jupiter, its JunoCam instrument captured what it would look like to ride along with the spacecraft.
Learn more HERE: https://t.co/QR8OQx6yVu pic.twitter.com/Lwiwj7CvGe