అంతరిక్షంలో వైట్ ఏంజిల్.. ఫోటోలు విడుదల చేసిన నాసా

by Sumithra |
అంతరిక్షంలో వైట్ ఏంజిల్.. ఫోటోలు విడుదల చేసిన నాసా
X

దిశ, ఫీచర్స్ : మన విశ్వంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. నేటికీ అంతరిక్షం గురించి ప్రజలకు అర్థం కాని అనేక విషయాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని రహస్యాలు బయటపడినప్పుడు ఆశ్చర్యానికి గురవుతాం. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమే నాసా ప్రత్యేక టెలిస్కోప్ లో చిక్కింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA వారు అంతరిక్షంలో కాంతి వంటి 'వైట్ ఏంజిల్'ను చూశారని పేర్కొంది.

తాజాగా నాసా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిత్రాన్ని షేర్ చేసింది. ఈ చిత్రానికి 'అంతరిక్షంలో ఎగురుతున్న ఖగోళ మంచు దేవదూతలా కనిపిస్తోంది' అనే క్యాప్షన్ రాశారు. మీడియా నివేదికల ప్రకారం, అంతరిక్ష సంస్థ తన టెలిస్కోప్‌తో ఈ చిత్రాన్ని తీసిందని పేర్కొన్నారు. ఇది మన భూమికి దాదాపు రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ అని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed