- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైడెన్‌కు షాక్.. ఇఫ్తార్ విందు రద్దు
దిశ, నేషనల్ బ్యూరో : ఏటా రంజాన్ మాసంలో ముస్లిం మతపెద్దలకు అమెరికా వైట్‌హౌస్‌లో ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. ఈక్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 2న ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని భావించారు. కానీ తాము వైట్ హౌస్‌లో జరిగే ఇఫ్తార్ విందుకు హాజరయ్యేది లేదని ముస్లిం మతపెద్దలు తేల్చి చెప్పారు. ఇతరులు కూడా ఎవ్వరూ ఈ ఆహ్వానాన్ని స్వీకరించవద్దని పిలుపునిచ్చారు. ఈ నిరసన గళం నేపథ్యంలో ఇఫ్తార్ విందును వైట్ హౌస్ రద్దు చేసుకుంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఇప్పటివరకు 34వేల మంది సామాన్య ప్రజలు చనిపోయారు. పాలస్తీనా సరిహద్దులన్నీ ఇజ్రాయెల్ మూసేయడంతో గాజా ప్రాంత ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఈ చేష్టలు చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఆయుధాలను అందించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దన్నుగా నిలుస్తున్నందుకే వైట్ హౌస్ ఇఫ్తార్ విందును ముస్లిం మతపెద్దలు బహిష్కరించారు. ఈ పరిణామంతో నాలుక కరుచుకున్న వైట్ హౌస్.. అమెరికాలోని పలువురు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించిందట. కొంతమంది ముస్లిం మతపెద్దలను పిలిచి రంజాన్ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందట.