Mumbai Attack: భారత్ కు సానుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు

by Ramesh Goud |   ( Updated:2024-08-17 07:38:38.0  )
Mumbai Attack: భారత్ కు సానుకూలంగా యూఎస్ కోర్టు తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబై దాడుల కేసు నిందితుడిని భారత్ కు అప్పగించే విషయంలో యూఎస్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తహవూర్ రాణాను భారత్ కు అప్పగించవచ్చని తీర్పునిచ్చింది. 2008లో జరిగిన ముంబై దాడులు యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని కూడా భయాందోళనకు గురి చేశాయి. ఈ కేసులో పాకిస్థాన్ మూలాలున్న తహవూర్ రాణా కీలక నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం రాణా అమెరికా అదుపులో ఉన్నాడు. తహవూర్ రాణాను భారత్ కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు గత సంవత్సరమే తీర్పును వెలువరించినా.. ఈ విషయంపై నిందితుడు ది రైట్ ఆఫ్ హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి రాణాను అమెరికాకు అప్పగించవచ్చని తీర్పు వెళువరించింది. దీంతో నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయినట్లే అని చెప్పవచ్చు. అయితే ఈ కేసులో ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ఇంకా అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

కాగా 2008 నవంబర్ 26న ముంబైలో ఉగ్రమూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ భీకర దాడిలో ఐదుగురు అమెరికన్ సిటిజన్స్ సహా 166 మంది చనిపోయారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రాణా కెనడాలో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. పాకిస్థాన్ మూలాలున్న రాణా ఈ దాడులకు ఆర్ధిక సాయంతో చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు డేవిడ్ హెడ్లీకి రాణా అత్యంత సన్నిహితుడు. దాడులకు ముందు ముంబైలో తుది రెక్కీ నిర్వహించింది కూడా తహవూరేనని హెడ్లీ గతంలోనే వెల్లడించాడు. మరో కేసులో ఉగ్రమూకలకు సాయం చేశాడని షికాగో కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ముంబై ఉగ్రదాడిలో నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను అమెరికా- భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందం కింత భారత్ కు అప్పగించాలని అమెరికాను కోరింది.

Advertisement

Next Story