- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mohamed Muizzu: అక్టోబర్‌లో భారత పర్యటనకు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు..!
దిశ, వెబ్‌డెస్క్:మాల్దీవుల అధ్యక్షుడు(Maldives President) మొహమ్మద్ ముయిజ్జు(Mohamed Muizzu) వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. అక్టోబర్ రెండో వారంలో మొయిజ్జు భారత్‌లో పర్యటించనున్నట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల(Bilateral Relations)పై ఆయన ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)తో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.కాగా గతంలో భారత బలగాలు(Indian Forces) మాల్దీవులను విడిచివెళ్లిపోవాలని ముయిజ్జు షరతు విధించిన విషయం తెలిసిందే.దీంతో ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయి.దౌత్య విభేదాల తర్వాత ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి.ముయిజ్జు చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.అక్టోబర్ 7-9 తేదీల్లో ఆయన భారత్‌కు రానున్నారని, 8వ తేదీన ప్రధాని మోడీతో చర్చలు జరపనున్నారని సమాచారం.ఇరుదేశాల సత్సంబంధాల బలోపేతం(Strengthening of relationships)తో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(Free Trade Agreement), ఇతర విషయాల గురించి ప్రధాని మోడీతో చర్చించనున్నారని సంబంధింత వర్గాలు తెలిపాయి.