మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించిన ఆ దేశ రాజు

by Harish |   ( Updated:2024-03-22 10:57:15.0  )
మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించిన ఆ దేశ రాజు
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో భారత్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో భారత ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భూటాన్‌కు చేరుకున్నారు. దీనిలో భాగంగా అక్కడి పారో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి థింపూ వరకు ఉన్న 45 కిలోమీటర్ల మార్గంలో భూటాన్ ప్రజలు, భారత్, భూటాన్ జెండాలను పట్టుకుని మోదీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. దీనిలో భాగంగా భారత్-భూటాన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

ఈ పర్యటనలో గతంలో మోదీకి ప్రకటించిన ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్యూక్‌ గ్యాల్పో’ను అందించారు. 2021లో 5,00,000 డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. గతంలో మోదీ భూటాన్‌కు వెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన అది వీలుకాలేదు. ఇప్పుడు ఆ అవార్డును భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ చేతుల మీదుగా మోదీ స్వయంగా తీసుకున్నారు. వాస్తవానికి మోదీ గరువారమే భూటాన్‌కు వెళ్లాల్సి ఉంది, అయితే వాతావరణ పరిస్థితుల సరిగ్గా లేకపోవడం పర్యటనను శుక్రవారానికి వాయిదా వేశారు.

Advertisement

Next Story