- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలాండ్ లోని జామ్ సాహెబ్ మెమోరియల్ వద్ద.. నివాళులర్పించిన ప్రధాని మోదీ
దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్ వెళ్లారు. బుధవారం పోలాండ్ రాజధాని వార్సాలో ఉన్న నవనగర్ మెమోరియల్ లో జామ్ సాహెబ్ మెమోరియల్ ను సందర్శించారు నరేంద్ర మోదీ. రెండవ ప్రపంచ యుద్ధంలో వందలాది మంది పోలిష్ పిల్లలకి ఆశ్రయం కల్పించిన నవనగర్ మహారాజ్ దిగ్విజయ్ సిన్హీ అయిన రంజిత్ సిన్హీ జడేజా విగ్రహం ఇక్కడే ఉంది. దీనిపై జామ్ నగర్ రాజ కుటుంబీకులు అయిన జామ్ సాహెబ్ శత్రుషియా సింగ్ జీ జడేజా మోదీకి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జడేజా కుటుంబ సభ్యులత మోదీ మాట్లాడడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలిష్ ప్రజలు అనుభవించిన కష్టాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడానికి.. భారత్. పోలాండ్ ప్రజల మధ్య చారిత్రక సంబంధాలను, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి ఆలోచించాలని వారు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.