- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ముగిసిన జపాన్ పర్యటన.. పపువా న్యూగినియా బయలుదేరిన మోడీ
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ జపాన్ టూర్ ముగిసింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు హిరోషిమా నగరంలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వంటి నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.
ఇక, జపాన్ పర్యటన ముగియడంతో ప్రధాని మోడీ అక్కడి నుండి ఇవాళ పపువా న్యూగినియా బయలుదేరారు. జపాన్ నుండి నేరుగా పపువా న్యూగినియా వెళ్తోన్న మోడీ అక్కడ జరిగే ఫోరమ్ ఫర్ ఇండియా -ఫసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతనం ప్రధాని మోడీ రేపు పపువా న్యూగినియా నుండి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు.
ఇక, హిరోషిమా నగరంలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రసంగించిన మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఇక ఆపాలని కోరారు. ఇది యుద్ధాల శకం కాదని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. ఇరుదేశాల చర్చల ద్వారా చర్చించుకుని యుద్ధాన్ని ఆపాలన్నారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వల్ల ప్రపంచంలోని కొన్ని దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు.
Also Read...