అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ‘మెటా’ సంచలన నిర్ణయం.. ట్రంప్ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత

by Satheesh |   ( Updated:2024-07-13 12:26:16.0  )
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ‘మెటా’ సంచలన నిర్ణయం.. ట్రంప్ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘మెటా’ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఈ మేరకు మెటా శనివారం అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. రాజకీయ నేతల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అనుమతించడం మా బాధ్యత అని.. అభ్యర్థుల ఆలోచనలను, వారి మాటలను అమెరికా ప్రజలు వినాలని అందుకే ట్రంప్ ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేసినట్లు మెటా తెలిపింది. నిబంధనలకు లోబడి సోషల్ మీడియా ఖాతాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మెటా సూచించింది. కాగా, 2021లో అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన నాటి నుండి ట్రంప్ ఖాతాలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్ బుక్, ఇన్స్టా‌గ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఆంక్షలు విధించాయి.

దీంతో ట్రంపే స్వయంగా ‘ట్రూత్’ అనే కొత్త సోషల్ మీడియా ప్లా్ట్ ఫామ్‌ను సృష్టించి ఆయన అభిప్రాయాలను ట్రూత్ వేదికగానే వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిప్లబికన్ పార్టీ నుండి ట్రంప్ మరోసారి బరిలో నిలిచారు. ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ట్రంప్ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లోనూ అధ్యక్షుడు జో బైడెన్‌పై ట్రంప్ పై చేయి సాధించారు. ఈ క్రమంలో ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై మెటా ఆంక్షలు ఎత్తివేయడం చర్చనీయాంశంగా మారింది. అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధిస్తే చిక్కులు తప్పవని.. ముందుగానే అలర్ట్ అయ్యి మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు ఎనాలిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మెటా కంటే ముందే ట్విట్టర్ ట్రంప్ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. అయినప్పటికీ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను మాత్రం ఉపయోగించడం లేదు. ఈ క్రమంలో మెటా రిస్ట్రిక్షన్స్ ఎత్తివేసిన.. ఫేస్ బుక్, ఇన్స్‌స్టా గ్రామ్‌ను ట్రంప్ వాడుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story