సూర్యుడిపై మాసివ్ హోల్.. భూమివైపు సౌర తుఫానులు వచ్చే అవకాశం!

by S Gopi |   ( Updated:2023-04-02 10:30:22.0  )
సూర్యుడిపై మాసివ్ హోల్.. భూమివైపు సౌర తుఫానులు వచ్చే అవకాశం!
X

దిశ, ఫీచర్స్: యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) జియోమాగ్నెటిక్ తుఫానుల గురించి హెచ్చరిక జారీ చేసింది. భూమి కంటే 20 రెట్లు పెద్దదైన మాసివ్ హోల్ భూగ్రహం వైపు శక్తివంతమైన సౌర తుఫానులను ప్రేరేపించే అవకాశం ఉందని స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) గుర్తించింది. ‘కరోనల్ హోల్’ అనే పేరు గల ప్రాంతం సూర్యుని ఉపరితలంపై ఖాళీ స్థలం మాదిరి కనిపిస్తుంది. దీనిని గుర్తించిన తర్వాత, భూ అయస్కాంత తుఫానుల విషయంలో యూఎస్ ఫెడరల్ ఏజెన్సీ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తాజా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇది ఎగ్జాక్ట్‌గా ఒక రంధ్రం కాదు, సూర్యుడి ఉపరితలం కంటే కంపారెటివ్‌లీ కూల్‌గా ఉండే విశాలమైన ప్రాంతం. ఇది నల్లగా కనిపిస్తోందని నిపుణులు తెలిపారు.

సౌరగాలుల ప్రభావం

‘కరోనల్ హోల్స్ మ్యాగ్నెటిక్ ఓపెన్ ప్లేసెస్. వేగవంతమైన సౌర గాలికి ఇవి మూలం. ఆల్ర్టావాయిలెట్ లైట్స్‌ను అనేక తరంగదైర్ఘ్యాలలో చూసినప్పుడు అవి చీకటిగా కనిపిస్తాయి. కొన్నిసార్లు సౌర గాలి భూమిపై అధిక అక్షాంశాల వద్ద అరోరాను(aurora) ఉత్పత్తి చేస్తుందని నాసా పేర్కొన్నది. నిపుణుల ప్రకారం.. భూమి వైపు గ్యాపింగ్ హోల్ ద్వారా గంటకు 2.9 మిలియన్ కిమీ వేగంతో సౌర గాలులు వీస్తున్నాయి. ఇవి మార్చి 31 తర్వాత భూమిని తాకవచ్చన్న పరిశోధకులు.. ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సూర్యుడి నుంచి నిరంతరం ప్రవహించే ‘చార్జ్డ్ సెల్స్’ భూమిపై ఉన్న ఉపగ్రహాలు, జీపీఎస్ అయస్కాంత క్షేత్రం, మొబైల్ ఫోన్‌లపై ప్రభావం చూపుతాయని.. గంటకు 1.8 మిలియన్ మైళ్ల వేగంతో భూ గ్రహం వైపు వస్తున్న సౌర తుఫాను భూమిని తాకవచ్చని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ స్పేస్ అండ్ క్లైమేట్ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డేనియల్ వెర్షారెన్ పేర్కొన్నారు. సూర్యుడిపై కరోనల్ హోల్ అనేది భయపడాల్సిన విషయం కానప్పటికీ దాని స్థానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా 11 సంవత్సరాల వ్యవధిలో సూర్యుడు తన కార్యకలాపాల గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఈ రకమైన హోల్స్ కనిపిస్తాయని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లోని స్పేస్ ఫిజిక్స్ ప్రొఫెసర్ మాథ్యూ ఓవెన్స్ చెప్పారు. ఆ హోల్స్ సెంట్రల్ మెరిడియన్‌ను దాటిన కొన్నిరోజుల తర్వాత భూమిపై వేగంగా గాలి వీస్తుందని, ఈ పరిస్థితి ఎలా ఉంటుందోననే విషయంలో ఉత్కంఠతోపాటు అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read..

మనకే కాదు.. ఆదివారం వాటిక్కూడా సెలవేనట.. 100 ఏళ్లుగా అదే తంతు!

Advertisement

Next Story

Most Viewed