- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Buckingham Palace | కింగ్ చార్లెస్ పట్టాభిషేకం : బకింగ్ హామ్ ప్యాలెస్ లోకి తుపాకీ తూటాలు విసిరిన వ్యక్తి
దిశ వెబ్ డెస్క్ : మరి కొద్ది రోజులలో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం జరుగనుండగా.. రాజు నివాసం అయిన బకింగ్ హామ్ ప్యాలెస్ లోకి ఓ వ్యక్తి తుపాకీ తూటాలు విసిరాడు. ఆ తూటాలు ప్యాలెస్ మైదానంలోకి పడ్డాయి. అది చూసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పట్టాభిషేకం జరగాల్సిన కొద్ది రోజుల ముందు ప్యాలెస్‌లోకి తుపాకీ తుటాలు వచ్చి పడడంతో అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది.
కింగ్ చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాంటి వేడకకు ఆతిథ్యం ఇచ్చే బకింగ్ హామ్ ప్యాలెస్ గేటు వద్దకు ఓ వ్యక్తి చేరుకొని, ప్యాలెస్ లోకి పలు వస్తువులు విసిరేశాడని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. దాడి చేసే ఆయుధం ఉందనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఒక అనుమానాస్పద బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. ఈ ఘటనపై మెట్రోపాలిటన్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ జోసెఫ్ మెక్ డొనాల్డ్ స్పందించారు. ఓ వ్యక్తి ప్యాలెస్ లోకి తుటాలు విసిరాడని చెప్పారు. కానీ కాల్పులు జరిగినట్టు గానీ, అధికారులు, ప్రజాప్రతినిధులకు గానీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. దీనిపై సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలో చార్లెస్, ఆయన భార్య క్వీన్ కెమిల్లా.. ప్యాలెస్ లో లేరని బ్రిటిష్ మీడియా పేర్కొంది. దీనిపై స్పందించేందుకు బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారులు నిరాకరించారు. ఇది ఒక ఉగ్రవాద చర్యగా పోలీసులు చెబుతున్నారు. అనుమానితుడి మానసిక ఆరోగ్య చరిత్రపై దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టయిన వ్యక్తి ఒంటరిగా ఉండేవాడిని చెప్పారు.
మే 6వ తేదీన 70 ఏళ్ల తర్వాత బ్రిటన్ లో జరుగుతున్న తొలి పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ వేడుక జరుగనుంది. పట్టాభిషేకంలో భాగంగా బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబ్బే వరకు జరిగే ఊరేగింపులో వేలాది మంది సైనికులు పాల్గొంటారు.