- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అప్పులు కట్టే స్థితిలో లేం ఆదుకోండి.. భారత్‌కు మాల్దీవ్స్ రిక్వెస్ట్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : భారత్ దగ్గర దాదాపు రూ.3,300 కోట్ల అప్పుచేసిన మాల్దీవులు.. దాదాపు గత నాలుగు నెలలుగా విపరీతంగా విర్రవీగింది. ప్రత్యేకించి చైనా పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మాటలతో ఇరుదేశాల మధ్య మంటలు రాచేశారు. పదేపదే భారత సైన్యం మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. అటువంటి ముయిజ్జు.. భారత్‌కు మాల్దీవులు కట్టాల్సి ఉన్న అప్పుల విషయం వచ్చే సరికి స్వరం మార్చారు. తాము భారత్ నుంచి స్థాయికి మించి అప్పులు చేశామని ఒప్పుకున్నారు. అప్పులను వెంటనే కట్టే స్థితిలో లేమని.. మాల్దీవులకు సహాయకారిగా ఉండే రుణ చెల్లింపు ప్రణాళికను ప్రకటించాలని భారత్‌కు మొహమ్మద్ ముయిజ్జు రిక్వెస్ట్ చేశారు. తమకు అత్యంత ఆప్తదేశం భారతే అని ప్రశంసలు కూడా కురిపించారు.
Advertisement
Next Story