'కోడి ముందా, గుడ్డు ముందా..?' అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌లో ఆన్స‌ర్ దొరికింది!

by Sumithra |
కోడి ముందా, గుడ్డు ముందా..? అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌లో ఆన్స‌ర్ దొరికింది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కోడి ముందా.. గుడ్డు ముందా.. అనే సంశ‌యం త‌ర‌త‌రాలుగా తొలుస్తున్న ప్ర‌శ్న‌గా మిగిలింది. అయితే, ఈ సందేహంలో ఎవ‌రికి త‌గ్గ అభిప్రాయం ప్ర‌కారం వారు వాదిస్తుండ‌టం చూస్తూనే ఉంటాము. అందుకే, ఈ కోడి, గుడ్డు పారడాక్స్ ఇప్ప‌టికీ తెగ‌డం లేదు. మ‌రోవైపు అసలు కోళ్లు ఎలా వ‌చ్చాయ‌నే విష‌యంపై విజ్ఞాన శాస్త్రం ఎప్ప‌టి నుండో అధ్య‌య‌నాలు చేస్తుంది. ఇప్ప‌టికి గానీ దీనిపై కొంత స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు ఇటీవ‌లి ఓ ప‌రిశోధ‌న తెలిపింది. కొత్తగా వ‌చ్చిన ఈ అంతర్జాతీయ పరిశోధన, మనుషులు కోళ్లను ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెంపొందించుకున్నారనేదానికి సాక్ష్యాలను అందించింది. గత 3500 సంవత్సరాల్లో మానవ సమాజంలో కోళ్లు ఏ విధంగా గుర్తించబడ్డాయో ఈ అధ్య‌య‌న ఫలితాలు చూపిస్తున్నాయి.

కోళ్ల‌ పెంపకం రహస్యాన్ని ఛేదించడంతో ఈ చరిత్ర గురించి ముందున్న‌ నమ్మకాలను ఈ స్ట‌డీ బద్దలు కొట్టింది. ఇంతకుముందు, చైనా, ఆగ్నేయాసియా, లేదంటే భారతదేశంలో కోళ్లు 10,000 సంవత్సరాల క్రితమే పెంచిన‌ట్లు తెలుస్తుంది. అలాగే, అవి 7000 సంవత్సరాల క్రితం ఐరోపాలో కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ స్ట‌డీ ఫలితాలను యాంటిక్విటీ జర్నల్, ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ USA (PNAS)లో ప్రచురించారు. ఆగ్నేయాసియాలో డ్రై రైస్ ఫార్మింగ్ రాక కోడికి చెందిన పూర్వ‌పు అడవి కోడి, రెడ్ జంగిల్ ఫౌల్ (గాలస్ గాలస్) పెంపకానికి దారితీసిందని వారి పరిశోధనలో తెలిసిందని ఫ్రాన్స్‌లోని పాల్ సబాటియర్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఒఫెలీ లెబ్రాస్యూర్ చెప్పారు.

కోళ్లు ప్ర‌పంచ‌వ్యాపితం అయ్యే ప్రక్రియ దాదాపు 1500 BC నాటికే జరుగుతోందని అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. ప్రారంభ గ్రీకు, ఎట్రుస్కాన్, ఫోనిషియన్ సముద్ర వ్యాపారులు మధ్యధరా సముద్రం అంతటా తరలించడానికి ముందు కోళ్లను ఆసియా అంతటా రవాణా చేసేవార‌ని తెలిపారు. నిజానికి, ఈ స్ట‌డీ కోడి ముందుగా మ‌నిషికి ఎలా ప‌రిచ‌యం అయ్యింద‌నే విష‌యంపై లోతుగా ప‌రిశీల‌న చేప‌ట్టి, వాటిని పెంచుకునే ప్ర‌క్రియ ఎలా మొద‌ల‌య్యింది, వాటి వ్యాప్తి, ఆహారంగా మారిన వైనం, త‌దిత‌ర ఫ‌లితాల‌ను తాజాగా ప్ర‌చురించింది.

Advertisement

Next Story

Most Viewed