ఐఎస్‌ఎస్‌కు వెళ్లే భారత వ్యోమగాములను కలవడానికి వెయిటింగ్: సునీతా విలియమ్స్

by Harish |
ఐఎస్‌ఎస్‌కు వెళ్లే భారత వ్యోమగాములను కలవడానికి వెయిటింగ్: సునీతా విలియమ్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కి వెళ్లనున్న భారతీయ వ్యోమగాములను కలవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తాజాగా తెలిపారు. భారత్‌కు చెందిన వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలిసి NISAR సంయుక్త ప్రాజెక్టుపై పని చేస్తుంది. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చిన తర్వాత టెక్సాస్‌ హ్యూస్టన్‌లోని నాసా సెంటర్‌లో శిక్షణ పొందుతున్న భారతీయ వ్యోమగాములను కలుసుకుంటానని అన్నారు.

భారత్-అమెరికా ఆకాశంలో అన్వేషణ కోసం కలిసి పని చేయడం చాలా విజయవంతమైంది. మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సునీతా విలియమ్స్ ఒక సందేశంలో చెప్పారు. ఇస్రో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి నలుగురిని ఎంపిక చేసి, వారిలో ఇద్దరిని శిక్షణ కోసం నాసాకు పంపించింది. వారిలో అన్ని పరీక్షలను విజయవంతంగా దాటుకున్న ఒకరిని అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తారు. మరోవైపు గత నెలరోజులుగా సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఆమె భూమికి తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

Advertisement

Next Story