UK: బ్రిటన్ ప్రధానిగా లిజ్‌ట్రస్

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-05 12:40:27.0  )
UK: బ్రిటన్ ప్రధానిగా లిజ్‌ట్రస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిట‌న్ ప్రధానిగా లిజ్‌ట్రస్ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన రిషి సునక్‌‌, లిజ్‌ట్రస్‌ లకు జరిగిన పోటీలో కన్వర్జేటీవ్ పార్టీ నేతబ్రిట‌న్ ప్రధానిగా లిజ్‌ట్రస్ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన రిషి సునక్‌‌, లిజ్‌ట్రస్‌ లకు జరిగిన పోటీలో కన్వర్జేటీవ్ పార్టీ నేత లిజ్‌ట్రస్‌ ఘన విజయం సాధించారు. బ్రిటన్‌లోని పాలక కన్జర్వేటివ్ పార్టీ,రెండు నెలల సుదీర్ఘ ప్రక్రియ అనంతరం సోమవారం దిగువ సభ – హౌస్ ఆఫ్ కామన్స్‌లో తమ దేశ తదుపరి ప్రధానమంత్రిని నిర్ణయించింది. దీంతో, బ్రిటన్ ప్రధానిగా లిజ్‌ట్రస్ మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రిషి సునక్, లిజ్‌ట్రస్‌కు మధ్య సాగిన హోరాహోరీ రేసులో లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు పోలవ్వగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఎల‌క్టరేట్ సంఖ్య 172,437. దీంట్లో 82.6 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 654 బ్యాలెట్ పేప‌ర్లను తిర‌స్కరించారు. బోరిస్ జాన్సన్ ప్రధాని బాధ్యత‌ల నుంచి త‌ప్పుకోవ‌డంతో క‌న్జర్వేటివ్ పార్టీలో పోటీ జ‌రిగింది. అయితే, రిషి సునాక్‌, లిజ్ ట్రస్ మ‌ధ్య చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ పోరు సాగింది. అనూహ్య రీతిలో రిషి సునాక్‌ క‌న్జర్వేటివ్ నేత రేసులో ఓట‌మి పాల‌య్యారు. కాగా, లిజ్ ట్రస్ విజయంతో 2015 ఎన్నికల నుండి కన్జర్వేటివ్స్ నుండి నాల్గవ ప్రధానిగా, మూడో మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు.

Advertisement

Next Story

Most Viewed