Lebanon: లెబనాన్‌ను వెంటనే వీడండి.. భారత పౌరులకు ఎంబసీ సూచన

by vinod kumar |
Lebanon: లెబనాన్‌ను వెంటనే వీడండి.. భారత పౌరులకు ఎంబసీ సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత పౌరులకు బీరూట్‌లోని రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. లెబనాన్ ను తక్షణమే విడిచి వెళ్లాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్యా లెబనాన్‌కు వెళ్లడం మానుకోవాలని సూచించింది. ఒక వేళ తప్పనిసరిగా అక్కడే ఉండాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలని, రాయబార కార్యాలయం సూచించిన ఈ మెయిల్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని తెలిపింది. ‘లెబనాన్‌లో ఉన్న భారతీయులందరూ ఆ దేశాన్ని విడిచిపెట్టాలి. ఏ కారణం చేతనైనా అక్కడే ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలి. తదుపరి నోటీస్ వచ్చే వరకు ఈ అడ్వైజరీని పాటించాలి’ అని పేర్కొంది. కాగా, గత ఆరు రోజులుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 580 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే భారత్ తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.

Next Story

Most Viewed