- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lebanon crisis:ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్ బొల్లా చీఫ్ కుమార్తె మృతి
దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడలకు పాల్పడుతోంది. దక్షిణ బీరుట్‌లోని హెచ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. లెబనాన్ వ్యాప్తంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లా లక్ష్యంగానే ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి నస్రల్లా కుమార్తె జైనబ్ మరణించినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె మృతిని హెజ్‌బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో ఆరు భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 90 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా అనేది తెలియల్సి ఉంది. అతడు మరణించినట్లు చెప్పలేమని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే, తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని కూడ అంటోంది. మరోవైపు, హెజ్‌బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. అతడితో కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం.
జైనబ్ మృతితో..
ఇకపోతే, హెజ్‌బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 1997లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఆమె సోదరుడు హదీ ప్రాణాలు కోల్పోయాడు. దీని గురించి జైనబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ ఫ్యామిలీ త్యాగాలు, హెజ్ బొల్లా లక్ష్యాలను అందులో వివరించారు. ఇప్పుడు ఆమె మృతిలో ఉద్రిక్తతలు మరింత ముదరున్నాయి. జైనబ్ మృతికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా దాడులను తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, బీరుట్‌లో దాడుల దృష్ట్యా హెజ్‌బొల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది. మరోవైపు, హెజ్‌బొల్లా స్థావరాలపైకి యాంటీ-షిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.