Kim Jong Un: కిమ్ అరాచక పాలనలో మరో ఉదంతం.. వరదలను అడ్డుకోలేదని 30 మంది మరణశిక్ష

by Ramesh Goud |
Kim Jong Un: కిమ్ అరాచక పాలనలో మరో ఉదంతం.. వరదలను అడ్డుకోలేదని 30 మంది మరణశిక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంత్రుత్వ పాలనలో నుంచి ఇటీవలే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. వరదలను అడ్డుకోలేదని ప్రభుత్వాధికారులకు మరణ శిక్ష విధించారు. కిమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తర కొరియాలో తన అరాచక పాలనతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేస్తూ పాలనలో కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాధికారులపై కిమ్ చూపించిన మరో దాష్టికం బయటపడింది. ఇటీవల ఉత్తరకొరియాలో భారీ వర్షాలు, వరదలతో ఆ దేశం అస్థవ్యస్తమైంది.

ఈ వరదల్లో చాలా గ్రమాలు కొట్టుకొనిపోయాయి. ఇందులో దాదాపు 4 వేల మంది మరణించారు. అయితే ఈ వరదలను నిలువరించలేక పోయినందుకు 30 మంది అధికారులకు మరణ శిక్ష విధించినట్లు జాతీయ మీడియా కథనాలు వెళువరించాయి. కొద్దిరోజుల క్రితం అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా 20- 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణ దండన విధిస్తున్నట్లు దక్షిణ కొరియా మీడియా ఓ కథనంలో వెల్లడించింది. మరి కొద్దిరోజుల తర్వాత వారికి మరణ శిక్ష అమలు పరిచినట్లు రాసుకొచ్చారు. కానీ ఆ అధికారులు ఎవరు, వారు చేసిన తప్పిదం గురించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.

Advertisement

Next Story