- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Election: ట్రంప్ అమెరికా పాత్రను తగ్గిస్తున్నారు: కమలా హారిస్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లిక్, డెమోక్రటిక్ అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన బలంగా ఉన్న అమెరికా పాత్రను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ట్రంప్ హాయంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దాని ఫలితాలను ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. బైడెన్ పరిపాలన కాలంలో ఆ తప్పులను సరిచేయడానికి అమెరికాను రక్షించడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నామని, ప్రజలు కొత్త మార్పుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.
అలాగే, తన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక సంస్కరణలను కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని, ఆహారం, కిరాణా వస్తువులపై ధరల పెంపుపై మొట్టమొదటి ఫెడరల్ నిషేధం ఉంటుందని అన్నారు. ట్రంప్ విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రతికూలతలు ఎదురయ్యాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో దీనిని అమలు చేయలేకపోయామని అన్నారు. శిలాజ ఇంధనాలు అధికంగా ఉండే పెన్సిల్వేనియాలో వివాదాన్ని పరిష్కరించాలని, ఫ్రాకింగ్, గాజా యుద్ధాన్ని త్వరగా ముగించడానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. అదే సమయంలో ఆయుధాల పంపిణీతో సహా కీలకమైన మిత్రదేశమైన ఇజ్రాయెల్ కోసం బైడెన్ హయాంలో ఉన్న నిబంధనలను తాను మార్చబోనని అన్నారు.
అలాగే ఇటీవల ట్రంప్, కమలా హారిస్ జాతి గుర్తింపు గురించి మాట్లాడటంపై కూడా తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అంతకుముందు ట్రంప్ ఒక మీడియాతో మాట్లాడుతూ, కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అనేది అర్థం కావట్లేదని అన్నారు.