- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిలు పోనిటైల్ వేసుకుంటే అబ్బాయిలకు 'కామవాంఛ' కలుగుతుందంట! స్కూల్స్‌లో బ్యాన్ చేశారు!!
దిశ, వెబ్‌డెస్క్ః 'ఏ జాతి చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం 'ఆడవాళ్లపై ఆంక్షల పర్వం' అనక తప్పట్లేదు. ఎందుకంటే, మానవుడు ఎంత ఎదిగినా బుర్రలో పితృస్వామ్య భావాన్ని చంపలేకపోతున్నాడు. బాడి బిల్డింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్ వంటి రంగాల్లో.. అంతెందుకు, భూమిపైన ఉన్న అన్ని వృత్తులను దాటి అంతరిక్షంలో ఆస్ట్రొనాట్‌గానూ స్త్రీలు శిఖరాగ్రాలకు చేరుతున్న ఈ కాలంలో 'ఆడోళ్లు ఇలా ఉంటే' మగాళ్ల మైండ్ మర్యాదను మరిచిపోద్ది' అనే విచిత్ర వాదన ఇప్పటికీ ఆచరణలో ఉండటం అమానుషం! వింతగా అనిపించొచ్చు కానీ, జపనీస్ పాఠశాలలు పోనీటెయిల్‌ను నిషేధించాయంట. అంతేనా, అమ్మాయిలు తెలుపు రంగులో ఉన్న లోదుస్తులు మాత్రమే ధరించాలని ఆంక్షలున్నాయిక్కడ. అవును, మీరు విన్నది నిజమే!! జపాన్‌లో పెద్ద సంస్కృతిగా చలామణిలో ఉన్న 'బురాకు కొసోకు' కఠినమైన నియమాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అమ్మాయిలు పోనిటైల్ వేసుకుంటే 'అమ్మాయి మెడ' కనిపిస్తుందనీ, దానితో పురుష విద్యార్ధుల్లో 'లైంగికంగా వాంఛ' కలుగుతుందని వారి వాదన. అందుకే, జపనీస్ పాఠశాలల్లో పోనీటైల్ నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నియమాన్ని చాలా మంది వ్యతిరేకించకపోలేదు. అయినప్పటికీ ఇలాంటి నిబంధనలపైన తగినన్ని విమర్శలు రాకపోవడంతో ఈ సమాజంలో ఇది సాధారణంగా మారిపోయింది. అంతేనా..?! 2020లో జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలో ఈ పోనిటైల్ అంశంపై నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, ప్రతి 10 పాఠశాలల్లో ఒకటి ఇలాంటి హెయిర్ స్టైల్‌ని వ్యతిరేకించాయి. ఇదే కాక, జపనీస్ పాఠశాలల్లో ఆడపిల్లల సాక్స్‌ల రంగు, స్కర్ట్ పొడవు, చివరికి ఐబ్రోస్ షేపులపైనా ఆంక్షలు పెట్టారు. ఇక, మంగోలియన్ దేశాల్లో ఎక్కువగా కనిపించే జుట్టుకు రంగులేసుకునే విధానాన్నీ బ్యాన్ చేశారు. జుట్టు నల్లగా, నిటారుగా లేకపోతే అది సహజమైనదనని నిరూపించుకోవాలి.
నార్త్‌కొరియాలో ఆంక్షల గురించి ప్రపంచానికి తెలిసినంత, జపాన్‌లో ఇలాంటి సంస్కృతి ఉంటుందని ఊహించని అంతర్జాతీయ సమాజం ముక్కున వేలేసుకుంటుంది. ఇంకొంత కాలం పోతే, స్త్రీలు గుండు చేసుకునే ఉండాలనీ, కాళ్లకు చెప్పు లేసుకోకూడదనీ, తలెత్తి చూడకూడదని, చివరకు ఇంట్లో నుండి బయటకే రాకూడదనే ఆంక్షలు అమలుచేస్తారో ఏమో..?!!