- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తి అకౌంట్లో పొరపాటున రూ.2.77 కోట్లు వేసిన అధికారులు, తర్వాత కోర్టుకెళ్లినా..?!
దిశ, వెబ్‌డెస్క్ః జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అయితే, అవి కొందరు అదృష్టంగా భావిస్తే, ఇంకొందరు దురదృష్టంగా అనుకుంటారు. అయితే, ఈ సంఘటనలో మాత్రం తప్పొప్పులను పక్కన పెడితే, ఈ విచిత్రమైన సంఘటన ఎవర్నైనా ధర్మసందేహంలో పడేస్తుంది. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ఒక పట్టణ పరిపాలన అధికారుల తప్పిదం వల్ల 46.3 మిలియన్ యెన్, అంటే సుమారు రూ. 2.77 కోట్లకు పైగా విలువైన కోవిడ్-19 సహాయ నిధులు ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాకు బదిలీ అయ్యాయి. పనైపోయిందనుకున్న అధికారులు తప్పు తెలుసుకునే లోపు జరగరానిది జరిగిపోయింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో, జపాన్‌లోని యమగుచి ప్రిఫెక్చర్‌లో నివసిస్తున్న 463 కుటుంబాలకు సంబంధించిన కరోనా సహాయ నిధులు ఫార్మాటింగ్ లోపం వల్ల తప్పుగా బదిలీ అయ్యి, డబ్బు మొత్తం 24 ఏళ్ల వ్యక్తి బ్యాంక్ ఖాతాలో పడింది. అయితే కథ ఇక్కడే మొదలయ్యింది. క్లరికల్ తప్పును గుర్తించిన అధికారులు డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నించగా నగదుతో పాటు వ్యక్తి కూడా మాయమైనట్లు గుర్తించారు. జపాన్ టుడేలో ప్రచురించిన వార్త ప్రకారం, జరిగిన పొరపాటును గుర్తించిన పట్టణ మేయర్ స్థానికులకు క్షమాపణలు చెప్పారు. అయితే, అధికారులు రికవరీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ప్రారంభంలో లబ్ధిదారుని కనుక్కోలేకపోయారు.
ఇంతలో, ఆ వ్యక్తి ఏప్రిల్ 8న ఈ ఆశ్చర్యకరమైన అదృష్టాన్ని పొందిన తర్వాత ప్రతిరోజూ తన బ్యాంకు ఖాతా నుండి సాధ్యమైనంత మొత్తాన్ని భాగాలుగా తీసుకొన్నాడు. చివరకు ఏప్రిల్ 21న, అంటే, పదమూడు రోజుల తర్వాత ఆ వ్యక్తిని వేటాడి, పట్టుకున్న అధికారులకు ఆ పెద్ద మొత్తం అదృశ్యమైందని తెలిసింది. అయితే, ఆ డబ్బంతా ఖర్చు అయ్యిందని, దాని గురించి ఏమీ చేయలేమని వ్యక్తి అధికారులకు చెప్పాడు. అయితే, ఆ వ్యక్తి సాంకేతికంగా దొంగతనానికి పాల్పడలేదని, అధికారుల లోపం కారణంగా డబ్బు బదిలీ చేయబడిందని అధికారులు తెలుసుకున్నారు. తీవ్రంగా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత గత వారం మే 12న చివరకు వ్యక్తిపై అధికారులు కోర్టు కేసు దాఖలు చేశారు. అయితే, చట్టపరమైన చర్యలు తీసుకునే సమయానికి, ఆ వ్యక్తి అప్పటికే తన ఖాతా నుండి డబ్బు మొత్తాన్ని తీసేసి, తన ఇంటిని క్లియర్ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.