'స్వాతంత్య్ర దినోత్సవం' రోజున.. మోదీతో దిగిన ఫోటోను షేర్ చేసిన ఇటలీ పీఎం

by Geesa Chandu |   ( Updated:2024-08-15 16:15:41.0  )
స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. మోదీతో దిగిన ఫోటోను షేర్ చేసిన ఇటలీ పీఎం
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశ 78 వ స్వాత్రంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని..ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో దిగిన ఒక ఫోటోను ఎక్స్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా.. "భారత ప్రజలకు హృదయ పూర్వక స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఎక్స్ లోని తన పేజీని అనుసరించే ఎంతోమంది భారతీయులకు విషెస్ తెలియజేశారు. ఇటలీ మరియు భారత్ బలమైన బంధాన్ని పంచుకుంటున్నాయి. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం.. భవిష్యత్తుకు కీలక పునాది వేస్తుంది" అని ఆమె ఈ సందర్భం లో వెల్లడించారు.

Advertisement

Next Story