- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel's Netanyahu: మాజీ ప్రత్యర్థికి కేబినేట్ లో చోటిచ్చిన నెతన్యాహు
దిశ, నేషనల్ బ్యూరో: అటు హెజ్‌బొల్లాతో యుద్ధం, ఇటు యెమెన్ హౌతీలతో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మాజీ ప్రత్యర్థి గిడియాన్ సార్(Gideon Saar)ను కేబినేట్ లోకి తీసుకున్నారు. అయితే, నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వాన్ని విస్తరించారు. అందులో భాగంగానే గిడియాన్ సార్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేకపోయినా సెక్యూరిటీ కేబినేట్ లో కొనసాగేలా నెతన్యాహు ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ దేశం కోసమే విభేదాలను పక్కకు పెట్టినట్లు తెలిపారు. ఇకపోతే, హమాస్, హెజ్ బొల్లా యుద్ధంలో సెక్యూరిటీ కేబినేట్ కీలక పాత్ర పోషిస్తుంది. మరో ప్రత్యర్థి అయిన రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ను సైతం ఇందులో భర్తీ చేయాలని గిడియాన్ కోరారు. కాగా దీనిపై నెతన్యాహు నుంచి స్పష్టత రానుంది.
నాలుగేళ్ల క్రితం పార్టీకి బైబై..
ఇకపోతే, గిడియాన్ గతంలో నెతన్యాహూ తో కలిసే పనిచేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలను నెతన్యాహు సమర్థించారు. దీంతో, నాలుగేళ్ల క్రితం పార్టీని వీడిన ఆయన.. మరో కొత్తపార్టీ ప్రారంభించి మద్దతు కూడగట్టుకున్నారు. మరోవైపు, వారిద్దరూ పాలస్తీనా రాజ్యస్థాపనను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. హెజ్ బొల్లాతో యుద్ధం, రాజకీయ ప్రక్రియలు, బడ్జెట్ సహా పలు అంశాల్లో నెతన్యాహుకు గిడియాన్ సాయం చేయనున్నారు. మరోవైపు, ఒప్పందంలో భాగంగానే 120 సీట్లున్న పార్లమెంట్ లో నెతన్యాహూ మెజారిటీ కూటమిని 68 సీట్లకు వ్యాప్తింపజేశారు. కాగా.. ప్రధాని కావాలని ఎదురుచూస్తున్న గిడియాన్ కు మరో అవకాశం దక్కినట్లైంది.