- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మృతిపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆకస్మిక మృతి ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారింది. ఇరాన్ పొరుగు దేశమైన అజార్ బైజాన్ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వాతావరణం అనుకూలించక తాను ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ కుప్పకూలి ఇబ్రహీం రైసీ మృతి చెందారు. ఈ దుర్ఘటనలో రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు సైతం మరణించారు. అయితే, ఇరాన్ ప్రెసిడెంట్ ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైసీ కాన్వాయ్‌లోని రెండు హెలికాప్టర్లు సేఫ్‌గా గమ్యస్థానానికి చేరుకోగా.. అధ్యక్షుడు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ మాత్రం కుప్పకూలడం కొత్త అనుమానాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే రైసీ మరణం వెనుక ఇరాన్ చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్, అమెరికా హస్తం ఉన్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మృతిపై ఎట్టకేలకు ఇజ్రాయెల్ స్పందించింది. ఇబ్రహీం రైసీ మరణానికి తాము కారణం అంటూ వస్తోన్న వదంతులను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ అధ్యక్షుడి మృతి వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ వస్తోన్న కథనాలపై ఇజ్రాయెల్ సీరియస్ అయ్యింది. రైసీ మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కాగా, ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు పరస్పరం దాడులు సైతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఊహించని విధంగా ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో పలువురు ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.