- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Middle East: గాజాలో 6 గురు బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ కిడ్నాప్ చేసిన బందీలలో ఆరుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లో రాత్రిపూట ఆపరేషన్‌లో తమ పౌరుల మృతేదేహాలను స్వాధీనం చేసుకున్నామని మిలటరీ మంగళవారం ఉదయం పేర్కొంది. మరణించిన వారిని అలెక్స్ డాన్సిగ్(75), యాగేవ్ బుచ్‌స్తావ్(35), చైమ్ పెరీ(79), యోరామ్ మెట్జ్‌గర్(80), నదవ్ పాప్‌వెల్‌వెల్(51), అవ్రహం ముండర్(78)గా పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆరుగురు కుటుంబాలకు తన సంతాపాన్ని పంపారు. ఈ సందర్భంగా బందీలను తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సైనికులు, కమాండర్లను ప్రశంసించారు. హమాస్ చెరలో ఉన్న మా పౌరులు జీవించి ఉన్న లేదా చనిపోయిన వారందరినీ తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని నెతన్యాహు అన్నారు.
గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి దాదాపు 250 కంటే ఎక్కువ మందిని బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ వారిని విడిపించడానికి దానిపై భయంకరంగా ఎదురు దాడులు చేస్తూనే ఉంది. ఈ బందీలలో కొంతమందిని చర్చల ద్వారా విడిచిపెట్టగా, మరికొందరు చనిపోయారు. ఇంకా 100 మందికి పైగా హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నట్లు సమాచారం. అటూ ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికాతో సహా ఇతర దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి.