Israel-Hezbollah:హెజ్బొల్లాకు మరోసారి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరిక..!

by Maddikunta Saikiran |
Israel-Hezbollah:హెజ్బొల్లాకు మరోసారి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరిక..!
X

దిశ, వెబ్‌డెస్క్:ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) మరోసారి హెజ్బొల్లా(Hezbollah)ను హెచ్చరించారు.లెబనాన్‌(Lebanon)లోని ఇరాన్ మద్దతు (Iran backed) గల హెజ్బొల్లా స్థావరాలపై ఇటీవల ఇజ్రాయెల్ సైనిక బలగాలు దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ దాడిపై నెతన్యాహు ఆదివారం టెల్ అవీవ్(Tel Aviv) నగరంలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..ఇదివరకే హెజ్బొల్లా ఎవరూ ఊహించలేని విధంగా దెబ్బ కొట్టామని, ఈ సందేశాన్ని హెజ్బొల్లా ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే,త్వరలోనే అర్థం చేసుకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో హెజ్బొల్లా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

కాగా హెజ్బొల్లా దళాలు ఉపయోగించే పేజర్లు, వాకీ-టాకీలు పేలిన తర్వాత ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య దాడులు మరింత పెరిగాయి.పేజర్లుpagers, వాకీ-టాకీల(walkie-talkies) పేలుళ్లకు ప్రతీకారంగా హెజ్బొల్లా ఇజ్రాయెల్ పై భీకర దాడులు చేసింది.ఈ దాడికి ప్రతిస్పందనగా గత శనివారం 290 రాకెట్ లాంచర్లతో లెబనాన్‌ రాజధాని బీరుట్(Beirut) శివారులోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు(Air Strike) చేసింది.ఈ దాడుల్లో హెజ్బొల్లా కీలక కమాండర్లతో సహా కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story