Israel-Hezbollah:హెజ్బొల్లాకు మరో షాక్..ఇజ్రాయెల్ దాడుల్లో మరో సీనియర్ కమాండర్ మృతి

by Maddikunta Saikiran |
Israel-Hezbollah:హెజ్బొల్లాకు మరో షాక్..ఇజ్రాయెల్ దాడుల్లో మరో సీనియర్ కమాండర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్:ఇజ్రాయెల్(Israel)-లెబనాన్(Lebanon) మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి.కాగా గత గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా(Hezbollah) చీఫ్ హసన్ నస్రల్లా(Hassan Nasrallah) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే హెజ్బొల్లా కు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఇజ్రాయెల్ ఆదివారం లెబనాన్ పై మరోసారి వైమానిక దాడులు(Air Strikes) జరిపింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా టాప్ కమాండర్ నబిల్‌ కౌక్‌(Nabil Qaouk)ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం ప్రకటించింది.ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) 'X'లో వెల్లడించింది.అయితే దీనిపై హెజ్బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.కాగా నబిల్‌ ప్రస్తుతం హెజ్బొల్లా సెంట్రల్‌ కౌన్సిల్‌ డిప్యూటీ చీఫ్‌గా పని చేస్తున్నారు.అతను 1990లో హెజ్బొల్లా టెర్రరిస్ట్ సంస్థలో చేరారు.1995 నుంచి 2010 వరకు దక్షిణ లెబనాన్ లో హెజ్బొల్లా సైనిక కమాండర్ గా పనిచేశారు.2020లో ఆయనతో పాటు హెజ్బొల్లా మరో సభ్యుడు హసన్ అల్ బాగ్దాదీపై అమెరికా ఆంక్షలు విధించింది.

Advertisement

Next Story

Most Viewed