ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: ప్రాణనష్టంపై ఐరాస వేదికగా మండిపడ్డ భారత్

by samatah |
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: ప్రాణనష్టంపై ఐరాస వేదికగా మండిపడ్డ భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరగడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదొక భయంకరమైన మానవతా సంక్షోభం అని తెలిపింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ బుధవారం ప్రసంగించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడమే ఏకైక మార్గమని చెప్పారు. యుద్ధంలో పిల్లలు, మహిళలు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ ఆయోదయోగ్యం కాదని తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో జరిగిన ఉగ్రదాడులు సైతం సరికాదని చెప్పారు. భారత్ ఉగ్రవాదాన్ని సహించబోదని తేల్చిచెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. యుద్ధం ముగిసే వరకు మానవతాసాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు భారత్ గాజాకు రెండు విడతలుగా 16.5 టన్నుల మందులు, వైద్య సామాగ్రి సహా 70 టన్నుల సాయం అందించిందని గుర్తు చేశారు. కాగా, గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారీగా పౌరులు మరణిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed