Israel-Hamas War : హమాస్ కు బిగ్ షాక్ .. మరో కమాండర్ ను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం

by Maddikunta Saikiran |
Israel-Hamas War : హమాస్ కు బిగ్ షాక్ .. మరో కమాండర్ ను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ - హమాస్ కు మధ్య గత కొన్ని రోజులుగా భీకరమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ దాడుల్లో ఇప్పటివరకు వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ను పూర్తిగా మట్టుబెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే గాజాను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ప్రస్తుతం హమాస్ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తోంది.కొన్ని రోజుల క్రితం ఇరాన్ దేశంలో హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ హతమార్చింది. తాజాగా వెస్ట్ బ్యాంక్‌లో స్థానిక హమాస్ కమాండర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.నిన్న పాలస్తీనా భూభాగంలో ఏకదాటిగా కాల్పులు, బాంబు దాడులకు ఇజ్రాయెల్ పాల్పడింది.దీంతో అక్కడ ఉద్రిక్త వాతవరణ పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన అధిపతి వాసేమ్ హజెమ్‌ను బోర్డర్ పోలీసులు హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. అయితే వాసేమ్ హజెమ్‌ కారులో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు వెంబడించి మరి దాడి చేసినట్లుగా తెలుస్తోంది.కాగా ఈ కారులోంచి తప్పించుకునే ప్రయత్నంలో మరో ఇద్దరు హమాస్ ముష్కరులు కూడా హతమయ్యారని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. వాహనంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హమాస్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ ఘటన గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

Next Story

Most Viewed