- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత
by Sridhar Babu |

X
దిశ, భద్రాచలం : రాజస్థాన్ కి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ బృందం వాహన తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా నుంచి రాజస్థాన్ కి కారులో ముఖేష్ మిర్ద, గుజ్జర్ శ్రీరామ అనే వ్యక్తులు 45.170 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రెండు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీహెచ్. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీష్, హనుమంతరావు, వెంకట్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Next Story