వసతి గృహంలో కరువైన పర్యవేక్షణ.. విద్యార్థికి పాముకాటు

by Aamani |
వసతి గృహంలో కరువైన పర్యవేక్షణ.. విద్యార్థికి పాముకాటు
X

దిశ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 వ తరగతి చదువుతూ అదే గ్రామంలోని బీసీ హాస్టల్ లో ఉంటున్న దారవత్ రోహిత్ అనే విద్యార్థికి పాము కాటు వేసింది.ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామానికి చెందిన ధరావత్ రోహిత్ బీసీ హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు.హాస్టల్ లో పాము కాటువేయగా సిబ్బంది వెంటనే ఇల్లంతకుంట పీహెచ్ సీలో ప్రథమ చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ఎల్లారెడ్డి పేట లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.

హాస్టల్ చుట్టూ పిచ్చి మొక్కలు,పంట పొలాలు..

గాలిపల్లి బీసీ హాస్టల్ చుట్టూ పిచ్చిమొక్కలతో పాటు పత్తి పంట పొలాలు ఉన్నాయి.హాస్టల్ ఆవరణ కూడా అపరిశుభ్రంగానే ఉండటం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

పామును చంపిన స్థానికులు.. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై

గాలిపల్లి హాస్టల్ లోనే విద్యార్థి రోహిత్ ను తన ఇనుప పెట్టె వద్దనే నాగుపాము చేతిపై గాట్లు వేసింది. సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు. స్థానికులు హాస్టల్ లో నాగు పామును పట్టుకుని బయట చంపారు.

Advertisement

Next Story

Most Viewed