- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breadfruit: బ్రెడ్ ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీనిలో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదలరు
దిశ, వెబ్‌డెస్క్: బ్రెడ్‌ఫ్రూట్ మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. ఈ పండ్లను దక్షిణ పసిఫిక్, ఇతర ఉష్ణమండల ప్రాంతాల వారు ఎక్కువగా తీసుకుంటారు. వారికి బ్రెడ్ ఫ్రూట్ ప్రధాన ఆహారం. బ్రెడ్‌ఫ్రూట్‌లో స్టార్చ్ గణనీయంగా ఉంటుంది. ఇది చాలా అరుదైన పండు. బ్రెడ్ ఫ్రూట్ రకాలు 2,000కు పైగా ఉన్నాయి. పసిఫిక్ దీవులలో ఈ చెట్లు పెరుగుతాయి. బ్రెడ్‌ఫ్రూట్‌లో 227 కేలరీలు ఉంటాయి. దీనికి మరో పేరు కూడా ఉంది. చాలా మంది ఈ పండును ‘కమాన్ని’ అని పిలుస్తారు.
బ్రెడ్‌ఫ్రూట్‌తో పాటు విత్తనాలను కూడా ఆహారంగా తీసుకుంటారు. ఈ పండు మూలాలను, ఆకులను రబ్బరు పాలు ఔషధాల తయారీకి యూజ్ చేస్తారు. అలాగే ఆస్తమా, ఆర్థరైటిస్, వెన్నునొప్పి, చెవి అంటువ్యాధులు, గాయాన్ని నయం చేయడంలో బ్రెడ్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు దట్టంగా ఉంటాయి. తెల్ల బియ్యంతో పోలిస్తే ఈ పండులో 16 రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే తెల్ల బంగాళాదుంపల కంటే రెట్టింపు ఫైబర్‌ను అందిస్తుంది.
ఈ పండులో పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే బ్రెడ్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది బెస్ట్ ఫ్రూట్‌గా చెప్పుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో బ్రెడ్ ఫ్రూట్ సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు నిపుణులు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.