Mirnalini Ravi : కల నెరవేరిందంటున్న యంగ్ బ్యూటీ.. ఆసక్తికర పోస్ట్ వైరల్

by Hamsa |
Mirnalini Ravi : కల నెరవేరిందంటున్న యంగ్ బ్యూటీ.. ఆసక్తికర పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మిర్నాలిని రవి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ఈ అమ్మడు తెలుగులో ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, గద్దలకొండ గణేష్ మామా మశ్చింద్ర, రోమియో వంటి మూవీస్ చేసి అభిమానులను మెప్పించి హీరోయిన్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలో.. మిర్నాలిని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేస్తూ ఇంటికి తల్లి పేరు పెట్టినట్లు వెల్లడించింది.

‘‘నా చిన్నతనంలో, అప్ప తన అమ్మ పేరు పెట్టి ఇంటిని నిర్మించి ఇచ్చారు. అప్పటి నుండి నా కల ఒక ఇల్లు కట్టి దానికి మా అమ్మ (మోజి) పేరు పెట్టడం. కలలు నిజమవుతాయని నాకు తెలియదు కానీ అయింది. మీ అందరి ఆశీస్సులు, మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. కాబట్టి దీన్ని సాధించడానికి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అనే క్యాప్షన్ పెట్టింది. ప్రజెంట్ మిర్నాలిని ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక తల్లికి ఇల్లు కట్టి ఇవ్వడంతో ఈ సంగతి తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed