- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hezbollah : ఇజ్రాయెల్‌కు నస్రల్లా ఆచూకీ చెప్పింది ఇరాన్ గూఢచారే.. ఫ్రెంచ్ పత్రిక సంచలన కథనం
దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మృతికి సంబంధించిన కీలక వివరాలతో ‘లే పారిసియెన్’ అనే ఫ్రెంచ్ వార్తా పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఉన్న ఒక ఇరాన్ గూఢచారి అందించిన పక్కా సమాచారం ఆధారంగా హసన్ నస్రల్లా ఉన్న బంకర్‌పై ఇజ్రాయెలీ ఆర్మీ దాడి చేసిందని కథనంలో ప్రస్తావించింది. లెబనాన్ భద్రతా దళానికి చెందిన విశ్వసనీయ వర్గాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించామని సదరు వార్తాపత్రిక పేర్కొంది.
బీరుట్ నగరం దక్షిణ ప్రాంతంలో ఉన్న హిజ్బుల్లా అండర్ గ్రౌండ్ హెడ్ క్వార్టర్‌లో హసన్ నస్రల్లా ఉన్నారని తెలిసిన వెంటనే ఇజ్రాయెలీ యుద్ధ విమానాలు అక్కడికి చేరుకొని బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డాయి. తొలుత ఆరు అంతస్తుల భవనాన్ని సాధారణ బాంబులతో కూల్చేసి, దాని కింద ఉన్న బంకర్‌పైకి పదుల సంఖ్యలో బంకర్ బస్టర్ బాంబులను యుద్ధ విమానాల నుంచి జారవిడిచారు. దీంతో బంకర్ ధ్వంసమైపోయి అక్కడికక్కడే నస్రల్లా, ఆయన అనుచరులు మట్టికరిచారు.