అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలి: నామ్ సదస్సులో విదేశాంగమంత్రి జైశంకర్

by samatah |
అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలి: నామ్ సదస్సులో విదేశాంగమంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో ప్రస్తుత వివాదానికి కారణమైన కీలక విషయాలపై భారత్ విదేశాంగమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, బందీలుగా తీసుకోవడం రెండూ సరికాదని స్పష్టం చేశారు. అన్ని దేశాలూ అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ఉగాండా దేశంలోని కంపాలాలో జరిగిన 19వ అలీనోద్యమ సదస్సులో జైశంకర్ ప్రసంగించారు. ‘ప్రస్తుతం గాజాలో ఉన్న సంఘర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ మానవతా సంక్షోభంలో ఎక్కువగా ప్రభావితమైన వారికి తక్షణమే ఉపశమనం కలిగేలా పరిష్కారం కనుగొనాలి’ అని చెప్పారు. శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంపై సమిష్టి కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. సంఘర్షణ ప్రాంతం లోపల లేదా వెలుపల వ్యాపించకుండా ఉండటం ముఖ్యం అని తెలిపారు. ప్రపంచ వృద్ధి శాంతి, స్థిరత్వంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఏ దేశంలో సంఘర్షణ జరిగినా అది ప్రపంచమంతా ప్రభావం చూపుతుందని తెలిపారు. ఉక్రెయిన్-రష్యా సైనిక ఘర్షణే ఇందుకు నిదర్శనమని..దీనివల్ల ఇంధనం, ఆహారం, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిందని గుర్తు చేశారు. నామ్ దేశాల మధ్య ఎల్లప్పుడూ సహకారం ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed