ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ

by Shiva |
ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి ఐసీసీ ఈ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం, ఉక్రెయిన్ నుంచి ప్రజలను రష్యన్ ఫెడరేషన్ కు చట్ట విరుద్ధంగా బదిలీ చేశారనే అనుమానం వ్యక్తం చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. వార్ రెండు దేశాల‌తో పాటు యావ‌త్ ప్రపంచంపై ప్రభావం చూపుతోంది. రెండు దేశాల్లో పెద్ద మొత్తంలో న‌ష్టం చోటుచేసుకుంది.

ఇప్పటికే ఉక్రెయిన్ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి. చాలా దేశాలు యుద్ధాన్ని ఆపాల‌ని కోరుతున్న ర‌ష్యా వెన‌క్కి ఏమాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధ నేరాలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణమని ఆరోపిస్తూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శుక్రవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే, ఏడాది పాటు సాగిన ఆక్రమణలో తమ దళాలు పొరుగు దేశానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలను పుతిన్ స‌ర్కారు నిరంతరం ఖండిస్తూ వస్తోంది.

Advertisement

Next Story