- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US: అమెరికాలో రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్ చేసిన భారత వైద్యుడి అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: రహస్య కెమెరాల ద్వారా చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రికార్డ్ చేసినందుకు అమెరికాలో 40 ఏళ్ల ఒయిమెయిర్ ఎజాజ్ అనే భారత వైద్యుడిని ఇటీవల అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న వైద్యుడి దురాగతాన్ని అతని భార్య వెలుగులోకి తీసుకురావడంతో ఓక్లాండ్ పోలీసులు ఎజాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎజాజ్ 2011లో ఇండియా నుంచి వర్క్ వీసాపై అమెరికాకు వెళ్లాడు. మొదట అలబామాలో ఉన్న అతను ఆ తరువాత 2018లో మిచిగాన్‌కు వెళ్లిపోయి వైద్యునిగా స్థిరపడ్డాడు.
అయితే అతను పనిచేసిన చోట బాత్‌రూమ్‌లు, ఆసుపత్రి గదులు, బట్టలు మార్చుకునే గదుల్లో రహస్య కెమెరాలను అమర్చి వందలాది నగ్న చిత్రాలు, వీడియోలను రికార్డ్ చేశాడు, అలాగే, అపస్మారక స్థితిలో ఉన్న అనేక మంది మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి ఆ వీడియోలను రికార్డు చేశాడు. అతను చేస్తున్న దురాగతాలు భార్యకు తెలియడంతో ఆ వీడియోలు, నగ్న చిత్రాలకు సంబంధించిన సాక్ష్యాలను ఆమె పోలీసులకు అందించారు. తర్వాత పోలీసులు ఆగస్టు 8న అతన్ని అరెస్ట్ చేసి ఇంటిని తనిఖీ చేయగా, కంప్యూటర్‌లు, ఫోన్‌లు, 15 ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఒక్క హార్డ్ డ్రైవ్‌లోనే దాదాపు 13,000 వీడియోలు ఉన్నాయని ఒక అధికారి తెలిపారు. క్లౌడ్ స్టోరేజ్‌లో కూడా ఈ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయడానికి నెలల సమయం పడుతుందని వారు పేర్కొంటున్నారు. ఇతని బాధితులు ఎవరైనా ఉంటే ఈ మెయిల్ లేదా నేరుగా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు