ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్: UN నివేదిక

by Mahesh |   ( Updated:2023-04-19 08:52:18.0  )
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్: UN నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్:భారత్ చైనా రికార్డును బ్రేక్ చేసింది. ప్రపంచలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు అత్యధిక జనాభా కలిగిన దేశంగా మొదటి స్థానంలో ఉన్న చైనాను బీట్ చేసి నెంబర్ వన్‌గా అవతరించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌ 2023’ పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ (UNFPA)నివేదికను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశ జనాభా 142.86 కోట్ల మంది ఉన్నారని..అదే సమయంలో చైనాలో జనాభా 142.57 కోట్ల జనాభా ఉన్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది మధ్యలో 29 లక్షల జనాభాతో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతున్నది. అయితే చైనా పాపులేషన్‌ను భారత్‌ ఎప్పుడు అధిగమించిందనేది స్పష్టం చేయలేదు. 2023 ఫిబ్రవరి వరకూ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక భారత్, చైనాల తర్వాత 34 కోట్ల జనాభాతో యునైటెడ్ స్టేట్స్ అమెరికా మూడవ స్థానంలో ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది

Advertisement

Next Story

Most Viewed