- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్ నుంచి మాల్దీవులకు చక్కెర, గోధుమలు, బియ్యం, ఉల్లిపాయలు..
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవుల మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్ మానవతా సాయంగా నిత్యావసర వస్తువులను ఆ దేశానికి ఎగుమతి చేయడానికి అనుమతించింది. మాల్దీవులకు చక్కెర, గోధుమలు, బియ్యం, ఉల్లిపాయలతో సహా నిత్యావసర వస్తువులను పరిమిత స్థాయిలో ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1న ప్రారంభమైన 2024/25 ఆర్థిక సంవత్సరంలో మాల్దీవులకు ఈ వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
1,24,218 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,09,162 టన్నుల గోధుమ పిండి, 64,494 టన్నుల చక్కెర, 21,513 మెట్రిక్ టన్నుల బంగాళదుంపలు, 35,749 టన్నుల ఉల్లిపాయలు, 427.5 మిలియన్ గుడ్లను ఎగుమతి చేయడానికి భారత్ అనుమతించింది. అలాగే, 1 మిలియన్ టన్నుల కంకర రాయి, నది ఇసుకను ఎగుమతి చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బియ్యం, చక్కెర, ఉల్లిపాయల ఎగుమతిలో అగ్రగామిగా ఉన్న భారత్ ఎన్నికల ముందు స్థానికంగా వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి, ధరల కట్టడికి వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అయితే తాజాగా పరిమిత స్థాయిలో మాల్దీవులకు ఎగుమతి చేయడానికి అనుమతించింది.
సాధారణంగా భారత్-మాల్దీవులు రెండు కూడా మంచి సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవి. అయితే మాల్దీవులు కొత్త అధ్యక్షుడిగా మొహమ్మద్ ముయిజ్జు ఎన్నికైనప్పటి ఆ దేశం భారత్ నుంచి దూరమవుతూ చైనాకు దగ్గరవుతుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.