ఆ మార్కెట్లో కేజీ మామిడి పండ్లు రూ.2400, కాకరకాయ రూ.1000

by Bhoopathi Nagaiah |
ఆ మార్కెట్లో కేజీ మామిడి పండ్లు రూ.2400, కాకరకాయ రూ.1000
X

దిశ, వెబ్‌డెస్క్ : గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఏ రకం కూరగాయ కొనాలన్నా రూ.80 పైబడే ఉన్నాయి. బీన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికం చికెన్ ధరలతో పోటీపడుతున్నాయి. బోడ కాకరకాయ, చింత చిగురు మటన్ రేటును అందుకున్నాయి. ఇక పండ్ల ధరలు చేదెక్కాయి. మేలు రకం ఆపిల్ ఒక్కొక్కటి రూ.50 పలుకుతుంది. మామిడి రూ.80 నుంచి రూ.200 వరకు ధర ఉన్నాయి. ఈ ధరలకే మనం ‘వామ్మో..’ అంటూ గుండెలు బాదుకుంటున్నాం. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేట్టట్టు లేదని ఆందోళనకు దిగుతున్నాం. కానీ ఇక్కడి మార్కెట్లో కేజీ మామిడి పండ్లు రూ.2400, కాకరకాయ రూ.1000, కేజీ బెండకాయ రూ.650లకు విక్రయిస్తున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం.

అయితే. ఈ ధరలు అమలు అవుతున్నది మన భారతదేశంలో మాత్రం కాదు. లండన్ షాపింగ్ మాల్స్‌లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన వనిత చవి అగర్వాల్ అనే యువతి ఇటీవల బ్రిటన్ రాజధాని లండన్‌లో ఉన్న ఓ ఇండియన్ స్టోర్‌కు వెళ్లింది. అందులో ఉన్న పండ్లు, కూరగాయలు, నిత్యవసర వస్తువులు, చిరుతిళ్ల ప్యాకెట్స్ ధరలను భారతీయులతో పంచుకుంది. వాటి ధరలను వీడియో తీసి సోషల్ మీడియాల్ షేర్ చేసింది. దాంట్లో ఆరు ఆల్ఫోన్సో మామిడిపండ్ల ధర రూ.2,400, కేజీ కాకరకాయలు రూ.1000, కేజీ బెండకాయలు రూ.650, పన్నీర్ ప్యాకెట్ రూ.700, మాజిక్ మసాలా చిప్స్ రూ.95 ఉన్నాయి. ఆ ధరలను చూసిన నెటిజన్స్ దిమ్మ తిరిగింది. వామ్మో ఇంత ధరలా అంటూ బెంబెలెత్తిపోతున్నారు. ఇండియాలో రూపాయల్లో ఉన్న ధరలు లండన్‌లో వందల రూపాయల్లో.. ఇక్కడ వందల్లో ఉన్న ధరలు అక్కడ వేలల్లో ఉంటడం షాక్‌కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story