Viral Video: పార్క్‌లో మూత్ర విసర్జనను అడ్డుకున్న వ్యక్తిని చితకబాదిన యువకుడు

by Ramesh Goud |
Viral Video: పార్క్‌లో మూత్ర విసర్జనను అడ్డుకున్న వ్యక్తిని చితకబాదిన యువకుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్క్ లో మూత్ర విసర్జన చేయకుండా అడ్డుకున్నందుకు ఓ వ్యక్తిని క్రూరంగా చితకబాదిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన ప్రకారం నార్త్ వెస్ట్ ఢిల్లీ, మోడల్ టౌన్ ప్రాంతంలోని ఓ స్ట్రీట్ పార్క్ సమీపంలో ఆర్యన్ అనే వ్యక్తి మూర్త విసర్జన చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పార్క్ పక్కనే టెంట్ సామాన్ల షాప్‌లో పని చేసే రాంఫాల్ మూత్ర విసర్జనను అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆర్యన్ కోపంతో మరుసటి రోజు రాంఫాల్ షాప్ ముందు నిద్రిస్తున్న సమయంలో వచ్చి దాడి చేయడం ప్రారంభించాడు.

కర్రతో రాంఫాల్ ను విపరీతంగా కొట్టాడు. అనంతరం బైక్ పై పరారయ్యాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. దాడి చేసిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్యన్ పార్క్ సమీపంలోనే ఓ వృద్దుడి ఇంట్లో పని చేస్తుంటాడని పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed