‘పీటీఐ’ని నిషేధిస్తే మరో పార్టీ పెడతా: పాక్ మాజీ ప్రధాని Imran Khan

by Mahesh |   ( Updated:2023-07-15 15:13:11.0  )
‘పీటీఐ’ని నిషేధిస్తే మరో పార్టీ పెడతా: పాక్ మాజీ ప్రధాని Imran Khan
X

ఇస్లామాబాద్: తన పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్’(పీటీఐ)పై నిషేధం విధించినా ఎలాంటి సమస్య లేదని, మరో కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పాక్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. మే నెలలో ఇమ్రాన్‌ను అరెస్టు చేయడంతో పాక్ వ్యాప్తంగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీటీఐ పార్టీపై నిషేధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ తరహా సమస్యకు పీటీఐని నిషేధించడమే పరిష్కారమని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనాబుల్లా అభిప్రాయపడ్డారు.

రక్షణ మంత్రి ఖవాజా సైతం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ‘పీటీఐపై వాళ్లు(ప్రభుత్వం) నిషేధం విధిస్తే మరో కొత్త పార్టీ పెడతాం. ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాం. ఆఖరికి వాళ్లు నా పై అనర్హత వేటు వేసిన, జైల్లో పెట్టినా మా పార్టీ గెలవడం ఖాయం’ అని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed