Houthis: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. హౌతీల స్థావరాలే లక్ష్యం

by vinod kumar |
Houthis: యెమన్‌పై ఇజ్రాయెల్ దాడి.. హౌతీల స్థావరాలే లక్ష్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌లో విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్ తాజాగా యెమన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. వారి కీలకమైన మౌలిక సదుపాయాలపై ఆదివారం వైమానిక దాడులు చేసింది. యెమన్‌లోని రాస్ ఇస్సా , హోడెయిడా ఓడరేవుల్లోని ఫైటర్ జెట్‌లు, పవర్ ప్లాంట్లే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. ఇజ్రాయెల్‌పై హౌతీలు ఇటీవల బాలిస్టిక్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా దాడులు నిర్వహించినట్టు వెల్లడించింది. ఈ దాడుల్లో నలుగురు మరణించగా 29 మంది గాయపడ్డట్టు హౌతీ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ అటాక్స్‌పై హౌతీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తున్నట్టు తెలిపారు. అయితే ఏడాది కాలంగా హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ సహాయంతో, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నారని ఐడీఎఫ్ తెలిపింది. అంతేగాక ప్రాంతీయ స్థిరత్వాన్ని అణగదొక్కడంతోపాటు సముద్ర రవాణాకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించింది.

Advertisement

Next Story

Most Viewed